నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

GNTR: పట్టణంలోని 11kv వాసవి ఫీడర్ పునరుద్దరణ, చెట్టుకొమ్మల తొలగింపు నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ P.H హుస్సేన్ ఖాన్ తెలిపారు. విజయవాడ రోడ్ ఈస్ట్ సైడ్, కబర్దినగర్, ఆర్చిరోడ్, నవభారత్ నగర్, రాఘవనగర్, ఇజ్రాయెల్ పేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అన్నారు.