తీజ్ పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

NZB: బాల్కొండ శాసన సభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం తన నివాసం నుంచి నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని గిరిజన, బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను అక్కాచెల్లెళ్లు నిష్టతో ఒక్కపొద్దున ఉండి అమ్మవారిని మెప్పిస్తూ జరుపుకుంటారని, అలాంటి పండుగ అందరికీ శుభాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.