కొమరాడలో ఏనుగుల గుంపు సంచారం

కొమరాడలో ఏనుగుల గుంపు సంచారం

PPM: కొమరాడలో పులిగుమ్మి పరిసరాల్లో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు పరిసర గ్రామాల రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటి కదలికలను గమనించాలని, అవి కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. ఏనుగులను ఇక్కడ నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.