అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్
KNR: చొప్పదండి పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని తోగురుమామిడికుంటలో ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు.