విద్యార్థిని ఆత్మహత్య.. కారణం ఏంటో ?
E.G: రామచంద్రాపురంలో ఐదవ తరగతి విద్యార్థిని రంజిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రంజిత మృతిపై ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా, హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే దీనికి టీచర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి అసలు విషయం పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుంది.