దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్
KDP: లింగాల మండలం మురారి చింతల క్రాస్ వద్ద కేబుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ కేసు వివరాలు వెల్లడించారు. పొద్దుటూరుకు చెందిన జమ్మయ్య, నాగరాజు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి నుంచి ఓ ఆటో, మోటార్ కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.