PGRS పరిష్కారానికి ఫోన్ చేయండి: కలెక్టర్

NLR: PGRS అర్జీల పరిష్కార సమాచారం కోసం కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.