'బట్టీలు కాల్చడానికి చార్ కోల్, , ఉనుక వాడాలి'

NRML: ఇటుక బట్టీలను కాల్చడానికి చార్‌కోల్, ఉనుక వాడాలని అటవీ శాఖ డిప్యూటీ ఆర్వో నజీర్ ఖాన్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలం బీరవెల్లి,ప్యారమూర్ శివారులోని ఇటుక బట్టీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటుక బట్టి కాల్చడానికి కలపను ఉపయోగించవద్దని సూచించారు. కలప ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.