ఏలూరులో రేపు జాబ్ మేళా
ఏలూరు జిల్లాలోని సత్రంపాడు ఐటీఐ కాలేజీలో ఈ నెల 12న (శుక్రవారం) నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి రమేశ్ పిలుపునిచ్చారు. బజాజ్ ఫైనాన్స్, మోహన్ స్పిన్ టెక్స్, తదితర ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణత పొందిన 18-35 ఏళ్ల వారు అర్హులన్నారు. ముందుగా ఆన్ల్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.