VIDEO: లారీల కొరతతో రైతుల ఇబ్బందులు
MDK: రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2000 బస్తాల ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేసినప్పటికీ లారీల కొరత వల్ల అక్కడే నిలిచిపోయాయి. లారీలు ఏర్పాటు చేయాలని రైతుల కోరుతున్నారు.