ఆరేళ్ల బాలుడికి బోన్ మారో శస్త్రచికిత్స
NLR: తలసేమియాతో బాధపడుతున్న తెడ్డుపాడు గ్రామానికి చెందిన టి. అన్విత్ (6)కు తన తమ్ముడి ఎముక మజ్జ సరిపోవడంతో బోన్ మారో మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. చికిత్సకు సుమారు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిఫార్సు చేయగా, ఫిబ్రవరి 16న బెంగళూరులోని ఆసుపత్రిలో అన్విత్‌ను చేర్చి అవసరమైన పరీక్షలు, సన్నాహాలు ప్రారంభించారు.