'పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదు'

KMR: రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదని రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు.