ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ELR: జీలుగుమిల్లి మండలం తాటియాగులగూడెం, దర్భగూడెం గ్రామాల్లోని నాయకులు బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం 'మన ఊరు- మన జెండా' కార్యక్రమంలో భాగంగా జెండాను ఆవిష్కరించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని, కేంద్రం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు.