రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

TPT: తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం బుధవారం జరగనున్నట్లు టీటీడీ చైర్మన్ B.R నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకానున్నట్లు పేర్కొన్నాడు. కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.