రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కమిషనర్
HNK: కాజీపేట పట్టణంలోని శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని GWMC కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్బంగా కమీషనర్ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అభిషేకాలు చేసి, అనంతరం రామాలయంలో అర్చనలు చేశారు.ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు గుడి చరిత్ర, విశిష్టతని కమిషనర్‌కు వివరించారు.