రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులు

VZM: రాష్ట్ర స్థాయి పోటీలకు బొబ్బిలి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం బి. జ్యోతికుమారి తెలిపారు. అండర్-17 విభాగంలో జూవెనల్ త్రోకు పి. సీతమహాలక్ష్మి, 400 మీటర్ల రనింగ్‌లో కె. కృష్ణవేణి, అండర్-14 విభాగంలో 200 మీటర్ల రనింగ్‌లో కె. కుమారి, లాంగ్ జంప్,100 మీటర్ల రనింగ్‌లో ఎం. రాధిక ఎంపికయ్యారు.