వర్షానికి ఏర్పడిన ఇసుక దిబ్బలు.. హైడ్రా జోక్యంతో క్లియర్

RR: కర్మన్ ఘాట్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 5లో నిన్న మొన్న కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై ఇసుక దిబ్బలు పేరుకుపోయాయి. దీంతో వాహనదారులు, స్థానికులకు ఇబ్బందులు పడ్డారు . ఈ సమస్యను గమనించిన కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి ఇసుక దిబ్బలను తొలగించి రోడ్డు మళ్లీ సాఫీగా మార్చారు.