గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త సైబర్ మోసాలు: ఎస్పీ
కోనసీమ: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వంటగ్యాస్ సరఫరాపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దు అన్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయొద్దని సూచించారు.