కొత్త DSPలకు శిక్షణా కార్యక్రమం..హాజరైన డీజీపీ
TG: గ్రూప్1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణా కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. డీజీపీ శివధర్ రెడ్డి ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్గొన్నారు. పోలీస్ అకాడమీలో మొత్తం 112 మంది కొత్త డీఎస్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు.