కోసిగిలో సీజనల్ హాస్టళ్లు ప్రారంభించాలి: AISF
KRNL: కోసిగి మండలంలో 16 సీజనల్ హాస్టళ్లను ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు పెట్టకపోవడం దారుణం అని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ అన్నారు. మండల అధికారులు వలసలను నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అధికారులు తక్షణమే హాస్టళ్లను ప్రారంభించాలని, లేనిపక్షంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.