'మహిళల వల్లే భారత్ ముఖ్యదేశంగా అవతరించింది'

'మహిళల వల్లే భారత్ ముఖ్యదేశంగా అవతరించింది'

AP: దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. వారికోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని.. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని పేర్కొన్నారు.