'కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

MNCL: బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక 139వ మేడే దినోత్సవ సందర్భంగా జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మేకల రాజేశం గురువారం జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి అన్నారు. ప్రతి కార్మికునికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని లాభాలు దక్కాలన్నారు.