సర్పంచ్ రిజర్వేషన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సర్పంచ్ రిజర్వేషన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కలెక్టర్  రాహుల్ రాజ్ అల్లాదుర్గ్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్ రిజర్వేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేరకు ఆయన ఎంపీడీవో, అధికారులతో కలిసి నామినేషన్ ప్రక్రియ, భద్రతా చర్యలు, అభ్యర్థుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు అవసరమైన తగు సూచనలు చేశారు.