'చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూపకల్పన చేయాలి'

'చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూపకల్పన చేయాలి'

ASR: జిల్లాలో, మండల స్థాయిలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రూపకల్పన చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం రాత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖనిజాల లభ్యతపై మండలాల వారీగా సమగ్ర సమాచారం తయారు చేయాలన్నారు. క్వారీల నిర్వహణ, ఆ ప్రాంత స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలన్నారు. సమస్యలు ఉన్న చోట గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు.