కోడూరు ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ
మహిళా వేధింపుల ఆరోపణల కేసులో కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మహిళపై ఎమ్మెల్యే తల్లి ద్వారా పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. ఆరు నెలలుగా మోసం జరిగితే ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించిన న్యాయస్థానం, ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది.