ఘనంగా AISF ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VZM: ఏఐఎస్‌ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో పలుచోట్ల మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ.. చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు అనే నినాదంతో ఏఐఎస్‌ఎఫ్ విద్యా రంగ, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.