VIDEO: చొక్కయ్య గుట్టపైకి శ్రీవారు
NZB: భీమ్‌గల్‌లోని చొక్క యాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టణంలోని గ్రామాలయం నుంచి చొక్కయ్య గుట్టపైకి శోభాయాత్రగా ఊరేగించారు. మహిళలు మంగళ హారతులు, భాజా భజంత్రీల నడుమ శ్రీవారు కొండపైకి పయనమయ్యారు. శనివారం కొండపై శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు దేవదాయ కమిటీ సభ్యులు తెలిపారు.