ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

జనగామ: పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన వనపర్తి లచ్చమ్మ (50) అనే మహిళ ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక మనస్థాపానికి గురై నేడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.