రాష్ట్రపతి అసంతృప్తి.. బెంగాల్ నేతలకు షాక్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన టీఎంసీ నేతలకు నిరాశే ఎదురైంది. సమయాభావం వల్ల వారిని కలవడం సాధ్యం కాదని రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివాసీ సంక్షేమ పథకాలపై వివరించేందుకు 12 మంది సభ్యుల బృందం అనుమతి కోరింది. ఇటీవల బెంగాల్ పర్యటనలో తనకు అధికారిక స్వాగతం లభించలేదని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.