GWMC మేయర్‌పై మండిపడుతున్న స్థానికులు

GWMC మేయర్‌పై మండిపడుతున్న స్థానికులు

WGL: కాశిబుగ్గలో రూ.13 వేలు బకాయి ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్లను సిబ్బంది సీజ్ చేశారు. దీంతో GWMC పన్ను వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మేయర్ సుధారాణికి చెందిన ఆస్తులు, వ్యాపార సంస్థలు రూ. లక్షల పన్ను బకాయిలున్నా అధికారులు పటించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడికో న్యాయం ఉన్నవాడికో న్యాయమా అని మండిపడుతున్నారు.