'99 రోజుల ప్రణాళిక ద్వారా పారిశుధ్య చర్యలు ముమ్మరం'
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాల ద్వారా పారిశుధ్య చర్యలను ముమ్మరం చేస్తున్నామని మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 14, 35వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన పరిస్థితి చర్యల గురించి సిబ్బందికి వివరించారు.