నిరుద్యోగులకు ఉగాది కానుక 'జాబ్ క్యాలెండర్'

నిరుద్యోగులకు ఉగాది కానుక 'జాబ్ క్యాలెండర్'

W.G: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా తీపి కబురు అందించిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు భారీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమన్నారు.