నీలా తండాలో BRS పార్టీ అభ్యర్థి గెలుపు
బీబీనగర్ మండలం నీలా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు శాంతి రమేశ్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 62 ఓట్ల మెజారిటీతో బానోతు శాంతి రమేశ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విజయం పట్ల BRS నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.