జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు

VSP: విశాఖ జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికలు బుధవారం జరగనున్నాయని జీవీఎంసీ కమిషనర్ అమిత్‌గార్గ్ మంగళవారం తెలిపారు. కౌన్సిల్ హాల్లో ఉదయం 10 గంటలకు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ పోటీ పడుతోంది.