సీఐటీయూ అఖిల భారత మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
AKP: నర్సీపట్నం కళాసి కాలనీలో శ్రీ సీతారామ భవన నిర్మాణ కార్మిక సంఘం(CITU) జనరల్ బాడీ సమావేశం జరిగింది. డిసెంబర్ 31 తేదీ నుంచి జరగబోయే సీఐటీయూ అఖిల భారత మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు అడిగర్ల రాజు మాట్లాడుతూ.. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ పాల్గొంటారన్నారు. సభలు విజయవంతం చేయాలన్నారు.