విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి..!
WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగరం గ్రామానికి చెందిన కత్తుల వెంకటేశ్వర్ పాలిచ్చే గేదెలను మేత కోసం వ్యవసాయ భూమి దగ్గరకు తీసుకెళ్లాడు. తుఫాన్ కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలను నేటికీ అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం మేతకు వెళ్లిన ఓ గేదె విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపాడు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.