కలెక్టర్ కార్యాలయం ముందు బ్రాహ్మణుల నిరసన
SRD: బ్రాహ్మణులను కించపరిచేలా పాట పాడిన జీడీ నరసయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. జీడి నరసయ్యపై వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.