ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

CTR: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాలసముద్రంలో సోమవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 11:30 గంటలకు హౌసింగ్ కాలనీలో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీని ప్రారంభిస్తారని చెప్పారు. 12:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొంటారు.