నామినేషన్ వేసి.. పట్టాలపై విగతజీవిగా!
TG: షాద్‌నగర్ నియోజకవర్గం కంసాన్‌పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన 4వ వార్డు అభ్యర్థి ఆవ శేఖర్ రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. అయితే ఆయన మృతిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎవరో చంపేశారంటూ ఆరోపించారు. కాగా, నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని శేఖర్‌ను కొందరు బెదిరించినట్లు తెలుస్తోంది.