వైసీపీ నేతలపై విరుచుకుపడిన మంత్రి
VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పి.పి.పి విధానం గురించి తెలియకుండానే ప్రైవేటీకరణ అంటూ సంతకాలు సేకరించారని, ప్రైవేటీకరణకు పి.పి.పి విధానానికి ముందు తేడా తెలుసుకోండని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీని మీద మేము చర్చకు సిద్ధమని మంత్రి సవాలు విసిరారు.