దరఖాస్తుల ఆహ్వానం

ADB: అగ్నిపథ్ భారత వైమానిక దళంలో క్లరికల్, టెక్నికల్ కేడర్లలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా తెలిపారు. పురుష అభ్యర్థులు బుధవారం ఉదయం 5గంటలకు, మహిళా అభ్యర్థులు వచ్చే నెల 5న ఉదయం 5 గంటలకు చెన్నైలోని తాంబరం 8 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లో అగ్నిపథ్ నియామక ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.