భారత తొలి రాష్ట్రపతికి ఘనంగా నివాళులు
ATP: భారత తొలి రాష్ట్రపతి, స్వాతంత్ర్య సమరయోధుడు, డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతిని బుధవారం గుత్తి ఫెన్షనర్స్ భవనంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఫెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జన్నే కుళాయి బాబు మాట్లాడుతూ.. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు.