'కళాకారులను అదుకోవాలని విజ్ఞప్తి'
PLD: తమను ఆదుకోవాలని కోరుతూ వినుకొండ తహశీల్దార్‌ను కళాకారులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తాము హరికథలు, భాగవతాలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం వాటికి ఆదరణ తగ్గి జీవనోపాధి కష్టంగా మారిందని తెలిపారు. నివసించడానికి కనీసం నివాస స్థలం కూడా లేదని, అందువల్ల కళాకారులకు స్థలం మంజూరు చేయాలని కోరారు.