ఉరేసుకొని కార్మికుడు ఆత్మహత్య

NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.