‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులకు అవగాహన
ATP: ఖరీఫ్ సీజన్‌లో పంటలకు సోకే తెగుళ్లపై జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ రైతులకు సూచించారు. పట్టణంలోని పైతోట వద్ద ఏడీఏ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. పంటలకు వ్యాపించే తెగుళ్ల గురించి అవగాహన కల్పించారు. రైతులు సరైన జాగ్రత్తలు తీసుకొని పంటలను రక్షించుకోవాలని సూచించారు.