'జగన్ కోర్టుకు వెళ్లడంలో బీజేపీ ప్రమేయం లేదు'

'జగన్ కోర్టుకు వెళ్లడంలో బీజేపీ ప్రమేయం లేదు'

AP: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైసీపీ వాళ్లు ఆకాశమంత అవినీతి చేస్తే ఆవగింజంత సాయం చేశారు. 400 కేజీల బంగారం కొనుగోలు చేశారన్నది నిజం. వాళ్లు చేసిన రూ.లక్షల కోట్ల కుంభకోణాల్లో ఇది చాలా చిన్నది. జగన్ సీబీఐ కోర్టుకు వెళ్లడంలో బీజేపీ ప్రమేయం లేదు. తప్పు చేసిన వాళ్లపై బీజేపీ ప్రభుత్వం తప్పక ఎటాక్ చేస్తోంది' అని వెల్లడించారు.