పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: మందస మండల గిరిజన ప్రాంతమైన డబార్షింగి గ్రామంలో రూ. 2.30 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన పీఎం జన్మన్ పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు విద్య, పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.