ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ATP: బెళుగుప్ప మండలం జీడిపల్లిలో నివాసముంటున్న ప్రకాష్ సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాష్ జీవితంపై విరక్తి చెంది తన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.