'హామీలు ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు'

VZM: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విజయనగరం మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగోట్ల శ్రావణి విమర్శించారు. సోమవారం కోలగట్ల నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 15న మహిళలకు అమలు చేస్తామన్న ఉచిత బస్సు ప్రయాణం తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని, హామీలు అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు.