చెట్ల కొమ్మలతో పాదాచారులు, వాహనదారుల ఇబ్బందులు

SRPT: కోదాడ పట్టణంలో ప్రధాన రహదారి డివైడర్ల మధ్య పెరిగిన చెట్లు పాదాచారులకు, వాహనదారులకు తీవ్ర బందులు కలిగిస్తున్నాయి. కోదాడ పట్టణంలోని బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా వ్యాపించిన చెట్ల కొమ్మలు కళ్లకు తగిలి ప్రమాదాలకు గురవుతున్నామని బుధవారం ఒక ప్రకటనలో స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే చెట్ల కొమ్మలను తొలగించాలని కోరారు.